అందం ఈమెను హత్తుకోకుండా ఓ క్షణం కూడా ఉండలేదేమో..

02 December 2023

8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించింది వయ్యారి భామ ఐశ్వర్య మీనన్. ఆమె కుటుంబం కేరళలోని చెందమంగళానికి చెందినది.

ఈరోడ్‌లో ఆమె పాఠశాల విద్య, వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది ఈ బ్యూటీ.

ఆమె SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ భామ.

2012లో కధలిల్ సోదప్పువదు యెప్పడి (తెలుగులో లవ్ ఫెయిల్యూర్) అనే చిత్రంలో ఓ సహాయ పాత్రతో సినీ అరంగేట్రం చేసింది.

తరవాత తమిళంలో చాల చిత్రాల్లో కథానాయకిగా నటించి కోలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

2013లో దసవల అనే ఓ కన్నడ డ్రామా చిత్రంతో శాండల్ వుడ్ తెరపై హీరోయిన్ గా తొలిసరి సందడి చేసింది ఈ అందాల భామ.

2016లో మలయాళం కామెడీ సినిమా మాన్‌సూన్ మంగోస్ అనే చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఫహద్ ఫాసిల్ ఇందులో హీరో.

ఈ ఏడాది మొదట్లో నిఖిల్ సిద్దార్థ్ సరసన కథానాయకిగా స్పై అనే యాక్షన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.