ఈమెతో ఉండడం వలనే ఆ అందానికి ఇంతటి విలువ వచ్చిందేమో..
28 November 2023
8 మే 1995న తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ లో జన్మించింది వయ్యారి భామ ఐశ్వర్య మేనేన్. ఈమె కుటుంబం కేరళలోని చెందమంగళానికి చెందినది.
ఈరోడ్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఈరోడ్‌లోని వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది.
SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.
2012లో సిద్దార్థ్, అమల పాల్ జంటగా వచ్చిన కాదలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ అందాల తార.
2013లో ఆపిల్ పెన్నే అనే ఓ తమిళ చిత్రంలో తొలిసారి కోలీవుడ్ సినిమాలో కథానాయకిగా నటించింది ఈ అందాల భామ.
అదే ఏడాది ఎంఎస్ రమేష్ దర్శకత్వంలో దసవల అనే ఓ కన్నడ చిత్రంతో శాండల్ వుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ.
2016లో మాన్‌సూన్ మంగోస్ అనే మలయాళీ సినిమాలో కథానాయకిగా మల్లూవుడ్ చిత్ర ప్రేక్షకులను అలరించింది ఈ భామ.
2023లో యంగ్ హీరో నిఖిల్ సరసన స్పై అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ అందాల తార.
ఇక్కడ క్లిక్ చెయ్యండి