లియో ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా..

28 September 2023

లియో ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడం వెనక రాజకీయ కుట్ర దాగుందా..? అసలేం జరుగుతుంది తమిళ ఇండస్ట్రీలో..?

లియో ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. అంత పెద్ద హీరో వేడుక ఉన్నట్లుండి అలా క్యాన్సిల్ చేయడం వెనక ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి.

కానీ నిర్మాతలు మాత్రం క్రౌడ్ కంట్రోల్ చేయలేమనే రీజన్ చెప్పారు. దాన్ని నమ్మడానికి ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. జైలర్ ఫంక్షన్‌కు రాని క్రౌడ్ ఇష్యూ.. విజయ్‌కు ఎందుకొస్తుందనేది వాళ్ల ప్రశ్న.

సెప్టెంబర్ 30న భారీగా లియో ఆడియో వేడుక ప్లాన్ చేసి ప్రోమోలు సైతం విడుదల చేసారు. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారు.

దీని వెనక తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, డిస్ట్రిబ్యూటర్ ఉదయనిధి హ్యాండ్ ఉందని టాక్ వినిపిస్తుంది.

ఆయన డిస్ట్రిబ్యూషన్ సంస్థైన రెడ్ జాయింట్‌కు కాకుండా మరో సంస్థకు లియో పంపిణి హక్కులు ఇచ్చినందుకే అనుమతులు రాకుండా చేసారనే ప్రచారం జరుగుతుంది.

ఆ మధ్య ఓ సభలో అధికార పార్టీపై సెటైర్లు వేసారు విజయ్. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వీటి కారణంగానే లియో వేడుక జరక్కుండా చేసారని ఆరోపిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

లియో కన్నా భారీ ఈవెంట్స్ ఎన్నో గతంలో చెన్నైలోనే జరిగాయి. ఇప్పుడు లియోకి ఎంచుకున్న స్టేడియం చిన్నదే అయినా.. ప్లానింగ్ ఉంటే సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.