కల్కిలో తేజ సజ్జా?

TV9 Telugu

16 March 2024

డార్లింగ్‌ హీరో ప్రభాస్‌కీ, హనుమాన్‌ హీరో తేజ సజ్జాకీ లింకు పెడుతూ ఇటీవలి కాలంలో చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఆదిపురుష్‌తో ప్రభాస్‌ ఫెయిలైన చోట, హనుమాన్‌తో తేజ సజ్జా క్లిక్‌ అయ్యారంటూ ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి అప్లాజ్‌ అందుకున్నారు తేజ సజ్జా.

ఇప్పుడు ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న కల్కిలో తేజ సజ్జా కీ రోల్‌ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ ఈ భారతీయ ఇతిహాసం సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ , రానా పోర్షన్‌లను తెరకెక్కించేశారట.

త్వరలోనే తేజ సజ్జా గురించి కూడా మేకర్స్ అఫిషియల్‌గా చెప్తారనే సోషల్ మీడియా వేదికగా మాటలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో కల్కి మూవీలో మీరు నటిస్తున్నారట కదా అనే ప్రశ్న ఎదురైంది యంగ్ హీరో తేజ సజ్జాకి.

ఆయన మాట్లాడుతూ ''నా కిట్టీలో ఇంట్రస్టింగ్‌ లైనప్‌ ఉంది. అందులో ఎన్ని సినిమాలున్నాయి? ఏంటనే సంగతులు త్వరలోనే అఫిషియల్‌గా వెల్లడిస్తాం'' అని అన్నారు.

ఆ మాట సరే, ఇంతకీ కల్కిలో నటిస్తున్నట్టా? లేనట్టా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు హీరో తేజ సజ్జా.