సందీప్‌కి శివకార్తికేయన్‌ అంత పెద్ద ఫ్యానా?

TV9 Telugu

08 March 2024

సందీప్‌కి కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్‌ ఫ్యాన్‌ అనగానే, టాలీవడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్ అనుకునేరు.

ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీల స్టార్ డైరక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా గురించి.

సందీప్‌ రెడ్డి వంగా చేస్తున్న సినిమాల గురించి నార్త్, సౌత్‌ అనే తేడా లేకుండా డిస్కషన్‌ జరుగుతుంటుంది.

సినిమాల్లో ఆయన రాసుకునే హీరోల కేరక్టర్ల గురించి కూడా సినిమా ఇండస్ట్రీలో తరచూ ఏవో మాటలు వినిపిస్తుంటాయి.

మూవీస్ లో మహిళలను సందీప్ రెడ్డి వంగ చూపించే తీరు గురించి కూడా ఫిలిం సర్కిల్స్ లో ఎప్పుడు చర్చ జరుగుతుంటుంది.

అయితే ఫస్ట్ టైమ్‌ తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడే తీరు గురించి ఓ సెలబ్రిటీ నోరువిప్పారు.

ఎదుటివారు ఎలాంటి ప్రశ్న అడిగినా, సందీప్‌ రెడ్డి స్పాంటానియస్‌గా సమాధానం చెబుతారని అన్నారు శివకార్తికేయన్‌.

కెప్టెన్‌ సందీప్ వంగలోని ఈ క్వాలిటీకి తాను పెద్ద ఫ్యాన్‌ అని చెప్పారు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌.