సలార్‌కి ఇంకా 40 రోజుల గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉంది. ఫైనల్ ఔట్‌పుట్ చూసుకుని మార్పులు చేర్పులు చేయాలి.
ఇవన్నీ జరగాలంటే టైమ్ కావాల్సిందే... మూవీ రిలీజ్‌ని వాయిదా వేయక తప్పట్లేదు టీమ్‌కి. మరి నవంబర్‌కి అంతా సెట్ అవుతుందా?
ఈ విషయం గురించి క్లారిటీ లేదు కానీ, ఆల్రెడీ నవంబర్ 24 మీద నార్త నుంచి ఎమర్జెన్సీ ఖర్చీఫ్ అయితే ఉంది.
మన దగ్గర కల్యాణ్ రామ్ సినిమా డెవిల్ కూడా సేమ్ డేట్‌ని అనౌన్స్ చేసింది. నవంబర్ లాస్ట్ వీక్‌లో రావడం పక్కా అంటున్నారు కల్యాణ్‌రామ్.
మరి సేమ్ డేట్‌ని సలార్ ఆక్యుపై చేస్తే, కల్యాణ్‌రామ్ తెగించి వచ్చేస్తారా? కాస్త ఆగిసాగుతారా? అనేది డౌట్.
ప్రభాస్ నవంబర్ 10కి ఫిక్స్ అవుతారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆల్రెడీ సేమ్ డేట్‌ని కేప్చర్ చేసేసింది టైగర్3.
ఇప్పుడు నేషనల్ వైడ్ స్పై కాన్సెప్టులకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ టైగర్ 3లో షారుఖ్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు. అందుకే ఆల్రెడీ సూపర్‌డూపర్ క్రేజ్ వచ్చేసింది మూవీకి.
తెలుగులో నవంబర్ 10న రిలీజ్ అవుతోంది ఆదికేశవ. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆదికేశవ సినిమా కోసం ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు.