05 January 2024

రవితేజకు బిగ్ షాక్... ఈగల్ ఆగినట్లే ??

TV9 Telugu

సంక్రాంతికి ఐదు సినిమాలు చెప్పినవి చెప్పినట్లు వచ్చేస్తున్నాయంటూ నిన్నటి వరకు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది.

పైగా దర్శక నిర్మాతలు మాటలు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించడం లేదని అర్థమైంది.

కానీ కట్ చేస్తే... ఇప్పుడు ఈగల్‌ ఆగిపోయింది. సంక్రాంతి రేస్‌ నుంచి సైడ్‌ అయిపోయింది.

మొదటగా ఈగల్ సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్.

కానీ ఇప్పుడున్న టాక్ చూస్తుంటే ఈ చిత్రం జనవరి 26కి వాయిదా పడినట్లు.. ఓ టాక్ అయితే వినిపిస్తోంది ఇండస్ట్రీ ఇంట.

అయితే రవితేజ ఈగల్ సినిమా పోస్ట్ పోన్ అయిందా అన్న దానిపై అఫీషియల్ ఇన్ఫో అయితే.. మేకర్స్ నుంచి రాలేదు.

మరి ఈ న్యూస్‌లో ఎంతవరకు నిజమవుతుందంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే!