అందాల ప్రియా ప్రకాష్ కు తెలుగులో అవకాశాలు లేనట్టేనా..?

Rajeev 

24 June 2025

Credit: Instagram

ప్రియా ప్రకాష్ వారియర్. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు.

ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది.

కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది.

ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది

కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.

మొన్నామధ్య పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో చేసింది. చివరిగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించి హిట్ అందుకుంది.