నాన్నే కాదు.. ఫ్యాన్స్ ఆశలన్నీ.. అఖీరా మీదే.!
Anil Kumar
16 June 2024
నిన్న మొన్నటి వరకు గూగుల్ ఇమేజెస్‌లో అఖీరా నందన్ అని సెర్చ్ చేస్తే.. ఒకటీ అరా ఫోటోలు మాత్రమే వచ్చేవి.
కానీ ఇప్పుడు అఖీరా అని టైమ్ చేయడమే ఆలస్యం.. కుప్పలు తెప్పలుగా.. ఈ హీరో ఫోటోలు నెట్టింట కనిపిస్తున్నాయి.
దానికితోడు ఆఫ్టర్ ఎలక్షన్ రిజెల్ట్ పవన్ కళ్యాణ్ కూడా.. ఎక్కడికెళ్లినా అఖీరాను వెంటేసుకుని వెళ్లడం..
పీఎం మోదీకి, సీఎం చంద్రబాబుకి కూడా అఖీరా ను పరిచయం చేయించి వారి ఆశ్వీరాదాలు ఇప్పించడాన్ని చూస్తుంటే..
పవన్ కళ్యాణ్.. అఖీరా ను తనలానే జనంలోకి తీసుకొస్తున్నారు అనే విషయం అందరికీ క్లియర్ గా అర్థం అవుతోంది.
దీంతో ఫ్యాన్స్ తో పాటు జనాల్లో కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ వారసుడిగా.. అఖీరా నందన్ పై ఫోకస్ పెరిగిపోతుంది.
వారి ఆశలన్నీ పవన్ నుంచి అఖీరా మీదికి మల్లుతున్నట్టు.. సోషల్ మీడియాలో అఖీరా క్రేజ్ చూస్తుంటే తెలుస్తోంది.
అఖీరా నందన్ భవిషత్తు ఏమైనప్పటికి.. పవన్ గెలవడంతో అఖీరా ఒక్కసారిగా ఫార్మ్ లో కనిపించడం అభిమానులకు పండగే..
పవన్ గెలుపుతో బయటకి వచ్చిన అఖీరా మొదటి వీడియో ఇప్పటికి వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి