ఓం భీమ్ బుష్ ఓటిటి డేట్ ఫిక్స్ అయినట్టేనా.?

TV9 Telugu

03 April 2024

శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ సినిమా ఓం భీమ్ బుష్.

దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రమిది. మార్చ్ 22న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

శ్రీవిష్ణుకి జోడిగా ప్రీతి ముఖుందన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

ఆయేషా ఖాన్, ఆదిత్య మీనన్, సూర్య శ్రీనివాస్, రచ్చ రవి, ప్రియా వడ్లమాని, మనీష్ కుమార్ ముఖ్య పాత్రధారులు.

2019లో వచ్చిన బ్రోచేవారెవరురా తర్వాత శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కలయికలో రూపొందిన చిత్రమిది.

సన్నీ ఎం.ఆర్. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు క్లైమాక్స్ లో తెలిపారు.

హిట్ బొమ్మ ఓం భీమ్ బుష్ సినిమాను అనుకున్న దానికంటే ముందుగానే ఓటిటిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ 19 నుంచి మూవీ మేకర్స్ ప్రముఖ ఓటిటిలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.