నీహారిక కొత్త అలవాటు... మంచిదేనా?
TV9 Telugu
14 March 2024
మెగా వారసురాలు, నాగ బాబు కూతురు, టాలీవుడ్ నిర్మాత నీహారిక కొణిదెలకి ఈ మధ్య ఓ విషయం కొత్తగా అలవాటైందట.
ఏంటని ఆరా తీస్తే, అసలు ఏ మాత్రం ఆలోచించకుండా తిండి పిచ్చి అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు ఈ మెగా బ్యూటీ.
పప్పు చారు అంటే తనకి చాలా ఇష్టమని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మెగా వారసురాలు నీహారిక కొణిదెల.
తనకు వంట చేయడం రాదు కానీ, మంచి ఫుడ్ మాత్రం తినిపెడతానని అంటున్నారు మెగా కాంపౌండ్ నిర్మాత నీహారిక కొణిదెల.
ఈ మధ్య తనకు కొత్తగా అలవాటైన మరో విషయం గురించి సోలో ట్రావెలింగ్ అని అంటున్నారు మెగా లేడీ నిహారిక కొణిదెల.
తాను సొంతంగా సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకుని సోలోగా ట్రావెల్ చేస్తున్నారట మెగా వారసురాలు నిహారిక.
నటిగా కమర్షియల్ సినిమాలు చేయాలని ఉందట. ఎవరైనా పిలిచి ఆడిషన్స్ చేయమని చెబితే తప్పకుండా చేస్తానని మాటిస్తున్నారు ఈ బ్యూటీ.
ఇప్పటిదాకా చేసిన ప్రతి పాత్రా ఎంతో ఇష్టంతో చేసిందేనని చెప్పారు నీహారిక. ప్రస్తుతం ఆహాలో ఓ షో, తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాడాటర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి