మెగా కోడలు లావణ్యకు అరుదైన వ్యాధి.? ఇదిగో క్లారిటీ..
త్వరలోనే మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఏడడుగుల బంధంతో ఒకటవనున్నారు.
ఇప్పటికే వీరిద్దరి వివాహ ముహూర్తాన్ని ఫిక్స్ చేసేందుకు ఇద్దరి కుటుంబసభ్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈలోగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాలీ ట్రిప్పులకు వెళ్లి వస్తున్నారు.
ఇకపోతే ఈ సొట్టబుగ్గల సుందరికి ఓ అరుదైన వ్యాధి ఉందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆమెకు ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధి ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు కొడుతున్నాయి.
దీంతో తాజాగా ఈ వార్తపై లావణ్య త్రిపాఠి స్పందించింది.
తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని.. తనకు ఎలాంటి వ్యాధి లేదని ట్వీట్ చేశారు.
ఇలాంటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న వారు ఎలాంటి ప్రయోజనం పొందుతారని గట్టిగా ప్రశ్నించారు.
ఇక్కడ క్లిక్ చేయండి