జబర్దస్త్ గుడ్ బై చెప్పనున్న  ఇంద్రజ ??

Phani.ch

28 May 2024

బుల్లితెరపై టాప్ షోగా దూసుకుపోతుంది జబర్దస్త్. ప్రేక్షకులను నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు చాలా మంది సినిమాల్లోకి వచ్చారు.

తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ప్రేక్షకులు కూడా ఈ కామెడీ షోకు బాగా అలవాటు పడ్డారు.

జబర్దస్త్ షోకు ముందుగా రోజా, నాగబాబు జడ్జ్ లుగా ఉన్నారు. ఆ తర్వాత ఈ షో నుంచి రోజా బయటకు వచ్చేశారు. రోజా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం జబర్దస్త్ షోకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంద్రజ కూడా షో నుంచి బయటకు రానున్నారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆమె తెలిపారు. జబర్దస్త్ ని వీడుతున్నట్టు ఇంద్రజ చెప్పుకొచ్చారు తెలిపారు. అయితే పూర్తిగా కాదని తెలుస్తోంది.

కొంతకాలం జబర్దస్త్ షోకు గ్యాప్ ఇవ్వనున్నారు ఇంద్రజ.. ఆతర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్బముగా జబర్దస్త్ ను వీడుతున్నట్టు వెల్లడించి ఎమోషనల్ అయ్యారు.

అయితే ఇంద్రజ జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కంటెస్టెంట్స్ తో చాలా ప్రేమగా మాట్లాడుతూ బాగా దగ్గరయ్యారు.

కంటెస్టెంట్స్ కూడా ఆమెను అమ్మ అని పిలిచేవారు. ఇప్పుడు జబర్దస్త్ ను వీడి వెళ్లడంతో ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. చాలా బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.