TV9 Telugu

ప్రభాస్ కల్కిలో తేజ సజ్జా.? నోరు విప్పిన తేజ.

15 March 2024

డార్లింగ్‌ ప్రభాస్‌కీ, హనుమాన్‌ హీరో తేజ సజ్జాకీ లింకు పెడుతూ ఇటీవలి కాలంలో చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఆదిపురుష్‌తో ప్రభాస్‌ ఫెయిలైన చోట, హనుమాన్‌తో తేజ సజ్జా క్లిక్‌ అయ్యారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి అప్లాజ్‌ అందుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జా.

ఇప్పుడు ప్రభాస్‌ కల్కి సినిమాలో తేజ సజ్జా కీ రోల్‌ చేస్తున్నారంటూ నెట్టింట వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ దుల్కర్‌ సల్మాన్‌ , రానా పోర్షన్‌లను తెరకెక్కించేశారట.! ఇక తేజ గురించి అఫిషియల్‌గా చెప్తారనే టాక్.

ఈ నేపథ్యంలో కల్కిలో మీరు నటిస్తున్నారట కదా అనే ప్రశ్న ఎదురైంది తేజ సజ్జాకి. ఆయన మాట్లాడుతూ..

''నా కిట్టీలో ఇంట్రస్టింగ్‌ లైనప్‌ ఉంది. అది ఏంటనే సంగతులు త్వరలోనే అఫిషియల్‌గా వెల్లడిస్తాం'' అన్నారు తేజ.

ఆ మాట సరే కానీ, ఇంతకీ కల్కిలో నటిస్తున్నట్టా? లేనట్టా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తేజ సజ్జా.