రాధికా పాప కావాలనే సైలెంట్ అయ్యిందా..? లేక ఆఫర్స్ తలుపు తట్టడం లేదా..?

Rajeev 

14 June 2025

Credit: Instagram

పూరీ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు.

కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. కానీ ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు కనెక్ట్ అయింది. 

దీంతో అందాల ఆరబోతకు తెరతీసింది. ఆ తర్వాత వచ్చిన నేహ సినిమా గల్లీ రౌడీ కూడా ఆడలేదు.

  అపజాయాల బాటలో ఉన్న నేహాకు.. సిద్దూ జొన్నలగడ్డ డిజే టిల్లు దిమ్మతిరిగిపోయే సక్సెక్ ఇచ్చింది. 

2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా నేహా ఫేట్ మారిపోయింది. రాధిక పాత్రలో ఆమె జీవించింది అనే చెప్పాలి.

 ఇదే ఊపులో.. యంగ్ హీరో కార్తికేయ సరసన బెదురులంక.. కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ సినిమాలు చేసింది.

టిల్లు స్క్వేర్‌లో అతిథి పాత్ర వేసి.. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నటించగా.. అది సో సోగా ఆడింది.

కానీ ఇప్పుడు ఈ చిన్నది ఆఫర్స్ అందుకోవడంలో వెనుకబడిందని టాక్ వినిపిస్తుంది. కొత్త సినిమా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఈ భామ.