పాయల్ పాపను పట్టించుకోవడం లేదా..? సైలెంట్ అయిన ఆర్ఎక్స్100 భామ
September 4
Rajeev
పాయల్ రాజ్ పుత్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిన్నదని పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా కుర్రాళ్ళు ఈ భామను అంత ఈజీగా మర్చిపోరు.
ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. కానీ క్రేజ్ తగ్గలేదు.
యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో అదరగొట్టింది ఈ చిన్నది.
తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది ఈ వయ్యారి భామ.
ఫస్ట్ మూవీ హిట్టైనా ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశపరిచాయి.ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం సినిమాలుచేసింది .
నటనపరంగా ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులు పడ్డా కూడా హిట్స్ మాత్రం రాలేదు. దాంతో సినిమాల స్పీడ్ తగ్గించింది.
తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది.