రాకీ భాయ్ కొత్త చిత్రం లాంచ్ అప్పుడే..

13 September 2023

కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు కన్నడ యాక్టర్ యష్. ఈ చిత్రంతో యాష్ కాస్త రాకీ భాయ్ గా మారాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2.. ఇండియా బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

కేజిఎఫ్ సిరీస్ చిత్రాల్లో రాకీభాయ్‌గా నటించిన యష్‌కు.. చిత్రం అనంతరం అదే పేరుతో మంచి క్రేజ్ సంపాదించాడు.

బాలీవుడ్‌లోనూ ఖాన్ త్రయాన్ని పక్కనపెట్టేసి.. బాక్సాఫీస్ దగ్గర కేజిఎఫ్ తన ప్రభంజనాన్ని చూపించాడు రాకీభాయ్.

ఇక కేజీఎఫ్ సిరీస్ అనంతరం మరే చిత్రం అనౌన్స్ చేయలేదు హీరో యష్. ఈ రాకింగ్ స్టార్ తదుపరి చిత్రం ఏంటి అనేది సస్పెన్స్‌గా మారింది.

ఆ సస్పెన్స్‌ను తెరదించుతూ.. తదుపరి చేయబోయే చిత్రాన్ని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాడు యాక్టర్ యష్.

సరిగ్గా రెండేళ్ల బ్రేక్ అనంతరం కన్నడ యాక్టర్ రాకింగ్ స్టార్ యష్.. మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ చిత్రానికి ఓకే చెప్పాడు యష్.

డిసెంబర్ 2023 నుంచి షూట్ ప్రారంభం కానుండగా... దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.