విక్రమ్ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్, అదే జోరులో నెక్ట్స్ మూవీని సిద్ధం చేస్తున్నారు.
ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న లోక నాయకుడు, తన అప్ కమింగ్ సినిమాతో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
విక్రమ్ రిలీజ్ అయిన వెంటనే యంగ్ డైరెక్టర్ హెచ్ వినోద్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు కమల్.
అయితే ఇండియన్ 2 వర్క్ ఫినిష్ చేయాల్సి ఉండటంతో ఈ సినిమా డీలే అవుతూ వస్తోంది. ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మరింత ఫైన్ ట్యూన్ చేస్తున్నారు వినోద్.
ఫిలిం కెరీర్‌తో పాటు పొలిటికల్ కెరీర్‌కు కూడా ఉపయోగపడేలా ఈ సినిమాను స్వయంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు కమల్ హాసన్.
తాజాగా కమల్ నెక్ట్స్ మూవీ టైటిల్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ టైటిల్‌ను పెడితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
90స్‌లో మర్మయోగి పేరుతో ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించారు కమల్. కానీ అప్పట్లో బడ్జెట్ సమస్యల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది.
ఇటీవల ఆ ప్రాజెక్ట్‌ను రీ స్టార్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా వర్కవుట్ కాకపోవటంతో ఆ టైటిల్‌ను తన నెక్ట్స్ సినిమాకు వాడేయాలని ఫిక్స్ అయ్యారు కమల్.