సినిమా ఇండస్ట్రీలో నాగ చైతన్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
07 December 2024
Basha Shek
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అందగాడు నాగ చైతన్య తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు అక్కినేని నాగచైతన్య
ఇటీవలే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నాగ చైతన్య, శోభతల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది
ఇక పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా శ్రీశైలం మల్లన్న స్వామి గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
కాగా నాగచైతన్య ఇటీవల దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్నాడు.తనకు సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న రానా ప్రశ్నకు.. 'నువ్వు ఉన్నావ్ కదా' అని సమాధానమిచ్చాడు.
'ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను' అని చైతూ అన్నాడు.
'చాలా మంది రానా నీ బంధువు కదా? అని అంటుంటారు.' నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటా' అని చై చెప్పుకొచ్చాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..