స్విమ్మింగ్, బ్యాట్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
09 December 2024
Basha Shek
'నాన్న సోల్జర్. చిన్నప్పట్నుంచి నేను చాలా క్రమశిక్షణతోనే పెరిగాను. మా ఇల్లంతా ఆర్మీ వాతావరణమే ఉండేది'
నాన్నకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అందుకే చిన్నప్పట్నుంచీ నన్ను క్రీడల వైపు వైపు నడిపించారు'
నేను స్విమ్మింగ్, బ్యాట్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్‌ని' అని అంటోంది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి.
ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు అరడజను సినిమాల్లో నటించిందీ మీనాక్షి. లక్కీ భాస్కర్ కూడా అందులో ఒకటి
ఇందులో ఆమె పోషించిన సుమతి పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. సినిమా కూడా వందకోట్ల క్లబ్ లో చేరింది.
ఇక వెంకటేశ్‌కి జోడీగా ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన మీనాక్షి తన పర్సనల్ లైఫ్ విషయాలను అందరితో పంచుకుంది
తాను ఫిట్‌గా ఉండటానికి కారణం నాన్నే కారణమని చెప్పుకొచ్చిన మీనాక్షి హీరోయిన్ అవుతానని అసలు అనుకోలేదట
ఇక్కడ క్లిక్ చేయండి..