ఆరడుగుల ఆహార్యం, బుర్ర మీసాలు, నిప్పు కనికల్లాంటి కళ్లు, గర్జించే కంఠం.. తెలుగు సినిమా విలన్ దాదాపు ఇలాగే ఉంటాడు. ఇలా విలన్ పాత్రలు చేసిన వారిలో గుర్తుకొచ్చే మొదటి పేరు ముఖేష్ రిషి
విలన్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ గుర్తింపుతెచ్చుకున్న ముఖేష్ రిషి కెరీర్‌లో ఆసక్తి కర విషయాలు చోటు చేసుకున్నాయి. తొలుత బాలీవుడ్‌లోఅడుగుపెట్టి, ఆ తర్వాత టాలీవుడ్‌లో టాప్ విలన్‌గా సెటిల్ అయ్యారు
1999లో ఆమిర్ ఖాన్ నటించిన ‘సర్ఫరోష్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ముఖేష్ రిషి పోషించిన ఇన్‌స్పెక్టర్ పాత్రతో మంచి పేరు వచ్చినా అవకాశాలు కరువయ్యాయి
అయినా నిరాశపడలేదు. సినిమా షూటింగ్‌ల విషయంలో మాత్రమే ఎప్పుడూ కచ్చితమైన సమయాన్ని పాటించే ముఖేష్.. ఆ అలవాటే ఆయనను సక్సెస్ వైపు నడిపించింది
ముఖేష్ కన్నా ముందు విలన్ పాత్రల్లో రాణించిన వాళ్లలో కొందరు సమయపాలన పాటించేవారు కాదు. దీంతో టైమ్ పంక్చువాలిటీ ఆయనకు బాగా కలిసొచ్చింది. దక్షిణాదిలో క్లిక్ అవడానికి కూడా ఇదే కారణం అయ్యింది
ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’లో దేవ్ పాత్రకు తొలుత ముఖేష్‌ను అనుకున్నారు. కానీ, ఆ పాత్రను ప్రదీప్‌సింగ్ రావత్ చేశారు. ఆ సమయంలో దక్షిణాదిలో వరుస అవకాశాలు వస్తుండటంతో డేట్స్ విషయంలో కొంత ఇబ్బంది తలెత్తిందట
దీంతో ముఖేష్ స్థానంలో ప్రదీప్ రావత్ దేవ్ ఆ పాత్రను పోషించాడని ఇటీవల ముఖేష్ రిషి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1994లో వచ్చిన బాలకృష్ణ ‘గాండీవం’తో ఆయన తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే
ఆ తర్వాత ఆరేళ్ల పాటు మళ్లీ దక్షణాదిన నటించలేదు. 2000లో జగపతిబాబు ‘మనోహరం’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్.. ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘జల్సా’ ఇలా వరుస సినిమాల్లో నటించి మెప్పించారు