హీరో సూర్యకి ప్రమాదం.. మీడియా ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్.
Anil Kumar
14 August 2024
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు స్టార్ హీరో సూర్య.
ఈ స్టార్ హీరో సూర్యకు తాజాగా షూటింగ్‌లో అనుకోని ప్రమాదం జరిగింది. దీనిపై ఆ మూవీ ప్రొడ్యూసర్ స్పందించారు.
ప్రస్తుతం ఈయన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఊటీలో జరుగుతుంది.
సెట్‌లో ఓ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా సూర్య తలకు గాయమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్..
త్వరగా అక్కడున్న సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్స్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు.
సూర్యకు టెస్టులు చేసిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినట్లు.. చిత్ర నిర్మాత రాజశేఖర్ పాండియన్ తెలిపారు.
అయితే సూర్య కి జరిగిన గాయం చిన్నదే అని.. అభిమానులు ఎవరు కంగారు పడొద్దని మీడియా ముఖంగా తెలిపారు నిర్మాత.
ఇక సూర్య నటించిన కంగువ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలు పెంచాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి