దేశం గొప్పతనాన్ని తెలిపే మధురమైన పాటలు

25 June 2024

మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం పాటతో స్వతంత్ర సమరయోధుల గురించి చాల చక్కగా తెలిపారు గాయకులు.

శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమా ఇందిరమ్మ ఇంటి పేరు పాటతో గాంధీ గురించి చాల బాగా తెలిపారు గాయకులు.

ఎన్టీఆర్ హీరోగా సుబ్బులో జననీ జన్మభూమి పాటతో భారతీయ యువత తమ జ్ఞానాన్ని దేశం కోసం ఉపయోగించాలని చిక్కగా చెప్పారు.

నవదీప్ హీరోగా నటించిన జై సినిమాలో దేశం మనదే పాటతో భారతదేశన్నీ పొగిడారు మ్యూజిక్ డైరెక్టర్, గాయకులు. 

మహేష్ బాబు బాబీ సినిమాలో ఈ జెండా పసిబోసి చిరునవ్వురా సాంగ్ తో జాతీయ జండా గొప్పతనాన్ని ఆలపించారు గాయకులు.

మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ బాపూ నువ్వే రావాలి అంటూ గాంధీ గురించి అద్భుతంగా తెలిపారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాలో  వినరా వినరా దేశం మనదేరా సాంగ్ వింటే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది.

రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఖడ్గం మేమే ఇండియన్స్ సాంగ్ తో భారతీయుల స్వభావాన్ని తెలిపారు మేకర్స్.

అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియాలో సెలవే లేని సేవాకా ఓ సైనికా అనే సాంగ్ వింటే గూస్ బంప్స్ రావాల్సిందే.

సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాలో ఏ దేశమేగినా అనే సాంగ్ వింటే దేశభక్తితో దేహం పులకరించిపోతుంది.