జూన్ చివరి వారం వార్ వన్ సైడ్.. అన్ని థియేటర్లలో డార్లింగ్ ఫ్యాన్స్ సందడి..

TV9 Telugu

24 June 2024

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఇండియన్ ఎపిక్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి.

దీపికా పదుకొనె సుమతిగా, అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ, కమల్ హాసన్ కలిగా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

రోక్సీగా దిశా పటాని కీలక పాత్రలో ఆకట్టుకోనుంది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా రాజన్ అనే ఓ పాత్రలో నటించారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో బుజ్జి అనే కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్స్ లో  బుజ్జి అందరికి ఆకట్టుకుంది.

ఈ సినిమాలో మాళవిక నాయర్ ఈ సినిమాకి కీలకమైన ఉత్తర పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ లో ఈ పాత్రను పరిచయం చేసారు మేకర్స్.

రాజేంద్ర ప్రసాద్, మరియమ్‌గా అలనాటి హీరోయిన్ శోభన, కమాండర్ మానస్‌గా శాశ్వత ఛటర్జీ, వీరన్‌గా పశుపతి, కైరాగా అన్నా బెన్ నటించారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలో జూన్ 27న బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుగొట్టడానికి సిద్ధం అవుతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్ అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.