అక్టోబర్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలో  అన్ని చిన్న సినిమాలే.. 

30 September 2024

Battula Prudvi 

సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ‘చిట్టి పొట్టి’ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.

శ్రీవిష్ణు, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'శ్వాగ్‌' అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘క‌బాలి’తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో పాపుల‌ర్ అయినా సాయిధ‌న్సిక‌ ప్రదన పాత్రలో సైకో కిల్ల‌ర్ బేస్డ్ మూవీ ‘దక్షిణ’ అక్టోబరు 4న రానుంది.

ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా మూవీ ‘కలి’ అక్టోబర్ 4న విడుదల కానుంది.

నోయల్, రిషిత నెల్లూరు జంటగా రాంప్రసాద్ కొండూరు దర్శకత్వంలో వచ్చిన ‘బహిర్భూమి’ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది.

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న '35 చిన్న కథ కాదు' అక్టోబరు 2న ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

శివకుమార్‌ రామచంద్రపు ప్రధాన పాత్రలో నటించిన ‘బాలు గాని టాకీస్‌’ అక్టోబరు 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 వేదిక అక్టోబర్ 4న అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో హిందీ డ్రామా చిత్రం 'ది సిగ్నేచర్' ప్రసారం కానుంది.