జనవరిలో హీరోయిన్లు ఫుల్ ఖుషీ.. గ్లామర్‌కి ఆడియన్స్ ఫిదా..
Prudvi Battula
10 February 2025
సంక్రాంతి సినిమాలతో హీరోయిన్లు ఫుల్ ఖుషీగా ఉన్నారనేది అందరికీ ఆనందం పంచుతున్న మాట. గ్లామర్ షోతో మెప్పించారు.
దబిడి దిబిడి అంటూ డాకు మహారాజ్‌తో హల్‌చల్ చేసేశారు ఊర్వశీ రౌతేలా. బాలయ్య సినిమాతో సౌత్‌లో సాలిడ్ హిట్ అందుకున్న ఊర్వశి ఆనందానికి అవధుల్లేవు.
ఒక్క మాటలో చెప్పాలంటే సిసలైన సంక్రాంతి సెలబ్రేషన్స్ చూసేశారు ఊర్వశి. ఇందులో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
తెలుగింటి ఆడపడుచు ఐశ్వర్య రాజేష్‌కి కూడా ఈ ఏడాది చాలా స్పెషల్. గోదారి గట్టుమీద రామచిలుక మన ఐశ్వర్య అంటూ స్పెషల్ అప్లాజ్ అందుకుంటున్నారు.
వెంకటేష్‌తో ఆమె జోడీ కట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో వెంకీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించారు మీనాక్షి చౌదరి.
ఎటొచ్చీ జస్ట్ గ్లామర్ డాల్ ఇమేజ్‌తో సరిపెట్టుకున్నది మాత్రం కియారానే. నానా హైరానా అంటూ మూవీ రిలీజ్‌కి ముందు హైప్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.
అడిషనల్‌గా జనవరిలోనూ ప్రేక్షకులతో కిస్సిక్ అనిపించేశారు శ్రీలీల. పుష్ప2 రీలోడెడ్ వెర్షన్ సంక్రాంతి రేసులో సందడి చేసింది.
అలా శ్రీవల్లి రష్మికతో పాటు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల కూడా పండక్కి ప్రేక్షకులను పలకరించేశారు. సో, ఇలా ఈ జనవరి జనాలకు గ్లామర్ మీల్స్ వడ్డించేసిందన్నమాట.
మరిన్ని వెబ్ స్టోరీస్
టాలీవుడ్ హీరోయిన్స్ కెరీర్ బెస్ట్ ఐకానిక్ రోల్స్ ఇవే..
ఈ డిస్నీ సినిమాలు చాల మందికి అల్ టైం ఫేవరేట్..
చెర్రీ అమితంగా ఇష్టపడే మూవీస్ ఏంటో తెలుసా.?