అందమా, బ్రహ్మ చెక్కిన అద్భుతమా.. ఇమాన్ పిక్స్ వావ్.. 

TV9 Telugu

25 August 2024

ఇమాన్ ఇస్మాయిల్ 20 అక్టోబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీలో జన్మించిన ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. మరో పేరు ఇమాన్వి.

అమెరికాలో ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి MBAలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

ఇమాన్వి కరాచీకి చెందిన ముస్లిం అమ్మాయి. ఈ ముద్దుగుమ్మ తండ్రి పాకిస్తాన్ దేశ సైనిక అధికారిగా ఉన్నారు.

చదువుతున్న రోజుల్లో డ్యాన్స్ పట్ల తన అభిరుచిని కొనసాగించింది. అమెరికాలోని స్థానిక డ్యాన్స్ అకాడమీలో కూడా చేరింది.

వివిధ రకాల నృత్యల్లో రాణించింది ఈ వయ్యారి భామ. చాల డ్యాన్స్ కాంపిటీషన్‎లో కూడా పాల్గొన్నది ఈ క్యూటీ.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, డ్యాన్సర్‌గా ఇమాన్ సాధించిన విజయం ఆమెకు పరిశ్రమలో అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది.

ఈ అందాల తార ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో ప్రదర్శన ఇవ్వడంతో పాటు ప్రసిద్ధ బ్రాండ్‌లకు మోడల్‎గా కూడా చేసింది.

ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో తొలిసారి హీరోయిన్‎గా నటిస్తుంది. మొదటి చిత్రంతోనే డార్లింగ్ సరసన నటించే ఛాన్స్ కొట్టింది ఈ బ్యూటీ.