ఇళయరాజా ఇంట విషాదం.. డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ అప్డేట్..
TV9 Telugu
28 January 2024
తెలుగు, తమిళం, మలయాళీ భాషల్లో లెజెండరీ సంగీత దర్శకుడు అయినా ఇళయరాజా ఇంట్లో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.
తాజాగా ఆయన కూతురు, ప్రముఖ గాయని భావతరిణి కన్నుమూసారు. ప్రస్తుతం ఆమె వయసు 47 సంవత్సరాలు. ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు.
శ్రీలంక దేశంలో జనవరి 25 రోజు సాయత్రం ఇళయరాజా కూతురు మరణించారు. దీంతో అయన ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.
కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. భావతరిణి మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ విజయంలో మ్యూజిక్ పాత్ర కీలకమని తెలిసిందే.
మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ సినిమాకు కూడా మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ను మించే పాటలివ్వాలని ప్లాన్ చేస్తున్నారు మణి.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మకు మళ్లీ ఆ స్థాయి సినిమా పడలేదు. అందుకే కసిగా కష్టపడుతున్నారు ఈ సీనియర్ సంగీత దర్శకుడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి