క్యారక్టర్ బావుంటే చిన్న పాత్రలకైనా సిద్ధం అంటున్న భామలు..
08 September 2023
పుష్ప సినిమాలో శ్రీవల్లి లాంటి పవర్‌ఫుల్ కేరక్టర్ చేస్తున్న టైమ్‌లోనే సీతారామమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక.
అందమైన ప్రేమకథలో తాను హీరోయిన్ కాకపోయినా ఫర్వాలేదు... మంచి కేరక్టర్ చేస్తే చాలనుకుని సీతారామమ్ కేరక్టర్‌ని ఒప్పుకున్నట్టు చెప్పారు మేడమ్ మందన్న.
నాని హీరోగా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. శ్రుతి హాసన్ కీ రోల్ చేస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు తన కిట్టీలో వేసుకున్నారు శ్రుతిహాసన్. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించారు శ్రుతి.
త్వరలోనే ప్రభాస్ సరసన కథానాయకిగా పాన్ ఇండియా చిత్రం సలార్‌తో స్క్రీన్స్ మీదకు రానున్నారు శృతి హాసన్.
మహానటి చిత్రంలో కథానాయకి సమంత, ఆచార్య సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఫ్రెండ్లీ కేరక్టర్లు చేశారు.
కేరక్టర్ బావుంటే నిడివిని పట్టించుకోనని ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా అన్నారు.
కేరక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటే నిత్య మీనన్‌ని కన్విన్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఓ వైపు హీరోయిన్లుగా కంటిన్యూ అవుతూనే, స్పెషల్ రోల్స్ చేయడానికి ఎలాంటి అబ్జక్షనూ పెట్టడం లేదు హీరోయిన్లు.