బిజినెస్ లో బన్నీ ఏ కింగ్.. మొత్తం ఎన్ని వ్యాపారాలు అంటే ??

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అలు అర్జున్ వరుస విజయాలతో సక్సెస్ సాధిస్తూ కెరీర్ పరంగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే.

తను చేసే వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందుకునేలా బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు బఫెలో వైల్డ్ వింగ్స్ లో ఫ్రాంఛైజీ కలిగి ఉన్నారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న బఫెలో వైల్డ్ వింగ్స్ బన్నీకి భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీలో సైతం బన్నీ పెట్టుబడులు పెట్టారు.

ఈ ఓటీటీకి బన్నీ కో ఫౌండర్ కాగా క్వాలిటీ తెలుగు సినిమాలు ఈ ఓటీటీలో ప్రసారమవుతున్నాయి.

అల్లు స్టూడియోస్ లో కూడా బన్నీ భారీగా పెట్టుబడులు పెట్టారు.

ఏఏఏ సినిమాస్ లో కూడా బన్నీ భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం.

ఈ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ స్క్రీన్ ఏకంగా 67 అడుగుల ఎత్తు ఉంది.

సౌత్ ఇండియాలో ఎల్.ఈ.డీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక థియేటర్ ఇదే కావడం గమనార్హం.

బన్నీ పెట్టుబడులు ఆయనకు భారీగా లాభాలను అందిస్తున్నాయి.