సోషల్ మీడియా లో ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డ్

TV9 Telugu

22  March 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ.

అల్లు అర్జున్ అంటే ఇష్టపడని వారుఉంటారా.. అతని ముద్దుగా ఐకాన్ స్టార్, స్టైల్ స్టార్, మల్లు అర్జున్, బన్నీ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా పిలుచుకుంటారు.

తన స్టైల్ చూసి మనసు పారేసుకోని అమ్మాయిలు ఉండరేమో. బన్నీ సినిమా రిలీజ్ అయితే చాలు పోటీపడి చూస్తుంటారు.

మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన బన్నీ ఇమేజ్.. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దడదడలాడిస్తోంది.

అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు భారీగా స్థాయిలో ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.

అంతలా ఒక రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా లో ఒక రికార్డ్ కూడా కొట్టారు.

తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న తొలి ద‌క్షిణాది న‌టుడిగా రికార్డుల‌కెక్కాడు.