అల్లు అర్జున్‌ ఎనర్జీ సీక్రెట్‌!

TV9 Telugu

08 March 2024

బూస్ట్ ఈజ్‌ ద సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ అనే మాటని చిన్నప్పటి నుంచీ చాలా సార్లు వినే ఉన్నాం. ఆమె అల్లు అర్జున్ సీక్రెట్‌ ఏంటి.?

ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ ని అడిగితే తన ఎనర్జీకి సీక్రెట్‌గా ఆయన సతీమణి స్నేహ రెడ్డి పేరు చెప్పేస్తున్నారు.

తనయుడు అయాన్‌, గారాల కూతురు అర్హతో ఎప్పుడూ ఏవో పిక్స్ పెడుతూనే ఉంటారు అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంపతుల వివాహం జరిగి ఇప్పటికి 13 ఏళ్లు పూర్తయింది.

వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సతీమణి స్నేహతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ.

అంతే కాదు, తాను ఇలా ఉండటానికి ఆమే కారణం అని సోషల్ మీడియా వేదికగా తన భార్యని మనసారా పొగిడారు ఐకాన్ స్టార్.

ఆమె ప్రశాంతత తనకి శక్తినిస్తుందని చెప్పారు. ఇలాంటి వార్షికోత్సవాలు జీవితకాలం జరుపుకోవాలంటూ తన క్యూటీని విష్ చేశారు.

ఇది చుసిన ఐకాన్ స్టార్ అభిమానులు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు.