TV9 Telugu
13 February 2024
పాకిస్తాన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్.. వీడియో అదుర్స్.
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా గ్లోబల్ హీరోగా మారిపోయాడు.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలకు ఆ క్రేజ్ పాకింది. తాజాగా పాకిస్తాన్ అభిమానులు సైతం పుష్పరాజ్ నటనకు ఫిదా అయ్యారు.
కరాచీలోని సందడిగా ఉండే వీధుల్లోకి వెళ్లిన తెలుగు యూట్యూబర్ ద్వారా పాకిస్థాన్‌లో పుష్ప క్రేజ్‌ను షూట్ చేశాడు.
తెలుగు సినిమాపై ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశాడు. స్థానికులు ఉత్సాహంగా అల్లు అర్జున్ ఐకానిక్ డైలాగ్ లు చెప్పేస్తున్నారు.
పాకిస్థానీయులు పుష్ప ఫీవర్ తో ఆనందంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల అంతటా పంచుకోవడం వైరల్‌గా మారాయి.
ఈ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మొదటి భాగం, పుష్ప 1 2021లో విడుదలైంది. పుష్ప 2 2024లో రిలీజ్ కానుంది.
ఈ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా సంపాదించింది.
పుష్ప పార్ట్ 1 ఊహించనిధంగా హిట్ కావడంతో పార్ట్-2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఆగస్టు 15, 2024న విడుదల కానుంది.
Learn more
ఇక్కడ క్లిక్ చెయ్యండి