08 October 2023

దశావతారాల్లో ఐకాన్‌ స్టార్.. ఫ్యాన్స్‌ చేసిన పనికి  బన్నీ దిల్ ఖుష్‌.

ఇండియన్ సినిమాస్ ముందు స్టార్ హీరోలుగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న హీరోలందరిలో అల్లు అర్జున్ కాస్త స్పెషల్.

ఐకాన్ స్టార్ ట్యాగ్ తో తన లేటెస్ట్ అండ్ స్టైలిష్ ఫోటోలతో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు ఈ హీరో .

యాంటీ ఫ్యాన్స్ కారణంగా అయినా.. ట్రోలింగ్‌లోనూ అప్పుడప్పుడూ అల్లు అర్జునే కనిపిస్తుంటారు. 

ఇలా మీడియం ఏదైనా.. మాగ్జిమమ్‌ తన కంటెంట్‌తోనే బజ్ చేసే ఐకాన్ స్టార్ మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.

తాజాగా  AI కారణంగా మరోసారి అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు ఐకాన్ స్టార్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ అంటే.. పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్.. బన్నీగా కాస్త కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకోసం AI టెక్సాలిజీని యూజ్ చేస్తున్నారు. రక రకాల గెటపుల్లో.. యాక్షన్ సీన్లో.. తమ స్టార్ హీరో బన్నీని డిజైన్  చేస్తూ..

నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. వారి వారి క్రియేటివ్‌ థాట్స్‌తో ఏకంగా బన్నీ వరకు  కూడా రీచ్ అయ్యేలా చేసారు.

అవి చూస్తే బన్నీ కూడా దిల్‌ని ఖుషీ అయ్యేలా చేస్తున్నారట ఈ హీరో ఫ్యాన్స్.