TV9 Telugu

యానిమల్‌పై నటి హ్యూమా రివ్యూ.. విజయ్‌ సినిమాలో ఆ దివంగత నటుడు..

15 Febraury 2024

రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్‌ తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు నటి హ్యూమా ఖురేషి.

సందీప్‌ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని అద్భుతంగా డైరక్ట్ చేశారని, సినిమా చూసినంత సేపూ ఎంజాయ్‌ చేశానని అన్నారు హ్యూమా.

నటిగా తాను కూడా యానిమల్ లాంటి సినిమాల్లో భాగమవ్వాలని ఉందని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి.

హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకోన్‌ జంటగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫైటర్‌.

ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు హృతిక్‌ రోషన్‌.

ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు హృతిక్‌ రోషన్‌.

విజయ్‌ హీరోగా నటిస్తున్న గోట్‌ సినిమాలో దివంగత నటుడు విజయ్‌ కాంత్‌ కేరక్టర్‌ను ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

ఇందుకుగానూ విజయ్‌కాంత్‌ కుటుంబసభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. విజయ్‌, విజయ్‌కాంత్‌ కలిసి గతంలో సెందూరపాండి సినిమాలో నటించారు.