TV9 Telugu

16 February 2024

టిల్లు భాయ్ నువ్వు కేక.! అనుపమ కెమిస్ట్రీ అదుర్స్.

కలర్‌ఫుల్‌ గా జోష్‌ లో దూసుకుపోతుంది టిల్లు స్క్వయర్‌ ట్రైలర్‌. యూత్‌ కి మరోసారి మ్యాడ్‌నెస్‌ని  పరిచయం చేసింది.

వేలంటైన్స్ డే సందర్భంగా సిద్దు , అనుపమనటించిన టిల్లు స్క్వ్యయర్‌ ట్రైలర్‌ రిలీజ్ చేసారు మూవీ మేకర్స్.?

టిల్లు ఫ్రాంచైజీ నుంచి మరో సూపర్‌డూపర్‌ కలర్‌ఫుల్‌ సబ్జెక్ట్ తో మనసులను గెలవడానికి రెడీగా ఉందన్న విషయం అర్థమైపోయింది.

టిల్లు స్క్వయర్‌ ట్రైలర్‌ కు యూత్‌ , నెటిజన్స్ నుంచి వస్తున్న ఆ స్పందన చూసి ఫుల్‌ ఖుషీగా ఉంది మూవీ యూనిట్‌.

మొన్న మొన్నటిదాకా పక్కింటమ్మాయి తరహా పాత్రలు చేసిన అనుపమ పరమేశ్వరన్‌, లేటెస్ట్ టిల్లు స్క్వయర్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు.

లుక్స్ తో పాటు, బాడీ లాంగ్వేజ్‌, సిద్ధు తో ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో అదుర్స్ అనిపించుకున్నారు అనుపమ.

ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ అనుపమ, సిద్ధు జోడీ కేక అంటున్నారు.మార్చి 29న విడుదల కానుంది టిల్లు స్క్వయర్‌.

ట్రైలర్‌లో డైలాగులు ఎంత హైలైట్‌ అయ్యాయో, రామ్‌ మిరియాల ట్యూన్స్ అంతే హైలైట్‌ అవుతున్నాయి.