ANIL KUMAR POKA
హాట్ టాపిక్ గా బాలీవుడ్ లవ్ బర్డ్స్.. హృతిక్ - సబా ఫొటోస్ వైరల్.
25 April 2024
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు.
ఫైటర్ సినిమాతో హిట్ అందుకున్న హృతిక్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సెట్ లో సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ , హీరోయిన్ సబా ఆజాద్ చాలా నెలలుగా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు చాలానే విన్నాం.
వీరి పెళ్లి జరగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.. ఇక మరోసారి వీరిద్దరి కలిసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
తన మొదటి భార్య సుసాన్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తరువాత సబా ఆజాద్‌తో లైవ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు హృతిక్.
హృతిక్ మరియు సబా ఆజాద్ తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు సరికదా ఇద్దరు కలిసి దిగిన చాల ఫొటోస్ షేర్ చేసారు.
వీరి బంధానికి సాక్ష్యంగా చాల ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీరు కలిసి ఫెస్టివల్స్ కూడా జరుపుకున్నారు.
సబా ఆజాద్ మరియు హృతిక్ రోషన్ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు అని., కలిసి ట్రిప్ లకు కూడా వెళ్లారని బీ టౌన్ లో టాక్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి