31 January 2024

'NTRతో వార్‌ కోసంవెయిటింగ్ అంటున్న హృతిక్

TV9 Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం తెలుగు, హిందీ అడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. అయితే  తాజాగా వార్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు హృతిక్.

ఫైటర్  మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హృతిక్.. వార్ 2 సినిమాపై అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని.. ఎన్టీఆర్ తో జరిగే షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని.. అందుకోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు.

అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో స్టార్ట్ కానుందని.. అప్పుడే తారక్ ఈ సెట్ లో అడుగుపెట్టనున్నారని సమాచారం.

ఫస్ట్ షెడ్యూల్ తర్వాత తారక్, హృతిక్ లపై ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని.. అందుకు ఇప్పటికే భారీ సెట్ వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.