ఫైటర్ దర్శకుడిపై ప్రేక్షకులు విమర్శలు.. గుంటూరు కరం నుంచి మరో వీడియో సాంగ్..

TV9 Telugu

05 February  2024

హృతిక్ రోషన్ హీరోగా నటించిన బాలీవుడ్ ఏరియాల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఫైటర్ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది.

అయితే తన సినిమా పరాజయాన్ని ఆడియన్స్‌పై రుద్దే ప్రయత్నం చేసారు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.

తన సినిమాను ప్రేక్షకులకు చూడ్డమే రాలేదని.. 90 శాతం మందికి ఫ్లైట్ జర్నీ అంటే ఏంటో తెలీదని అన్నారు ఆయన.

సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ విమర్శల పాలవుతున్నాయి. మరి ఈ కామెంట్స్‌పై ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది.

శ్రీలీల ఇందులో కథానాయక. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు దర్శక నిర్మాతలు.

కుర్చీ మడతబెట్టి, దమ్ మసాలా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా మూడో పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

తాజాగా గుంటూరు కరం సినిమా నుంచి ఓ మై బేబీ అంటూ సాగే ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదల చేసారు మూవీ మేకర్స్.