TV9 Telugu

20 December 2023

మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా.!

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.

ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ రాణిస్తున్న ఈ బ్యూటీ...

ఇప్పుడు గేర్ చేంజ్‌ చేశారట.  ఇక సినిమాల విషయంలో అనుపమ చాలా జాగ్రత్తగా ఉంటుంది.

కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు 2 సినిమా చేస్తుంది.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట అనుపమ.

ఇక ఇదంతా పక్కకు పెడితే.. ఈ బ్యూటీ ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తోంది.

ప్రస్తుతం అనుపమ కోటిరూపాయల వరకు రెమ్యునరేషన్ వసూల్ చేస్తుందట. ఇదే ఇప్పుడు మేకర్స్‌కు షాక్‌ అయ్యేలా చేస్తుందని టాక్.