TV9 Telugu
నెలకి ప్రియమణి ఎంత ఖర్చుపెడతారు?
26 Febraury 2024
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి అంటే తెలియని వారుండరు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన నటించారు.
ప్రతి నెలా హీరోయిన్ ప్రియమణి ఎంత ఖర్చు పెడతారు? అది కూడా ఇంటికో, వంటకో కాదు, తన కోసం తాను ఎంత ఖర్చుపెడతారు?
ఇది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. ప్రియమణికి మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చు పది వేల లోపే ఉంటుందట.
ఆమె ఆన్‌లైన్ షాపింగ్ చేయరు. ప్రతి నిత్యం ఏదో కొంటూ ఉండాలని ఉబలాటపడరు. ఎప్పుడూ బయటి హోటళ్లలో తినాలనుకోరు.
ఈమెకు స్నేహితులు కూడా చాలా తక్కువగా ఉంటారు. వాళ్లును కలిసినా కూడా నెలకో, రెండు నెలలకో మాత్రమే కలుస్తారు.
వాళ్లను కలిసిన చోట భోజనానికి పెద్దగా ఖర్చయ్యేది ఏమీ ఉండదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు హీరోయిన్ ప్రియమణి.
మినిమల్ ఈజ్ మోర్ అని నమ్ముతారు ప్రియమణి. అందుకే మేకప్ సామాగ్రికి కూడా ఎక్కువగా స్పెండ్ చేయరు ఆమె.
పార్లర్లకి వెళ్లడం కూడా చాలా అరుదుగానే ఉంటుంది. అందుకే నెలకి తనకు చాలా తక్కువ మొత్తంలోనే ఖర్చవుతుందని అంటారు ప్రియమణి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి