రెబెల్ స్టార్ సినిమాలో లోకనాయకుడు.. ఎంత సమయం ఉంటారంటే.?

TV9 Telugu

23 May 2024

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చింది.

పాన్ వరల్డ్ స్థాయిలో అనేక భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని ఇటీవల వెల్లడించారు.

ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అయన సినిమాలో ఎంత సమయం ఉంటారోని వార్త వైరల్ అవుతూంది.

అయితే మొదటి భాగంలో కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందని.. రెండో భాగంలో మాత్రం 90 నిమిషాలు ఉంటారని తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగులో తొలిసారి కనిపిస్తుంది.

మరో హీరోయిన్ గా నటిస్తుంది దిశా పటాని. ఇందులో ప్రభాస్ పక్కన ఈ బ్యూటీ స్టెప్పులు వేయనుంది. ఇది సినిమాకి హైలెట్ అంటున్నారు.

అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో అశ్వత్థామగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అశ్వత్థామ ఇంట్రో వీడియో ఆకట్టుకుంది.

తాజాగా బుజ్జి అనే కారును పరిచయం చేసారు మేకర్స్. భైరవతో మాట్లాడే ఈ కారుకు కీర్తి సురేష్ డబ్బింగ్ ఇచ్చారు.