పూజా హెగ్డే ఫెయిల్యూర్స్ ని ఎలా టాకిల్‌ చేస్తారు?

TV9 Telugu

14 March 2024

మనం పొందిన సక్సెస్‌ని టాకిల్‌ చేయడం ఎంత కష్టమో, అలాగే వచ్చిన ఫెయిల్యూర్స్ ని టాకిల్‌ చేయడం కూడా అంతే కష్టం.

అది కనుక చేతనైతే వాళ్లు కెరీర్‌లో సూపర్‌సక్సెస్‌ అవుతారని అంటారు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ నిపుణులు.

ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు పూజా హెగ్డే ఏం చేస్తారు? ఈ విషయాన్ని ఆమెనే అడిగితే ఇంట్రస్టింగ్‌ విషయాలు చెప్పుకొచ్చారు.

నేను కూడా మనిషినే. నాకు ఎమోషన్స్ ఉంటాయి. కాసేపు బాధగా అనిపిస్తుంది అంటున్నారు స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.

కానీ ఒకానొక సందర్భంలో దాన్నుంచి బయటపడతాను. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అని రివ్యూ చేస్తాను.

తప్పు తెలుసుకున్న తర్వాత ఓ క్లారిటీ వస్తుంది. అంతే... ఆ క్లారిటీతో ముందుకు సాగుతాను అంటారు బుట్టబొమ్మ.

ఎందుకంటే, ఎవరికైనా జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. దీని గురించి బాధపడటం వ్యర్థం అంటున్న హీరోయిన్ పూజ హెగ్డే.

ఎప్పుడూ ఎత్తులోనే ఉంటామంటే ఎలా? పడిపోయినప్పుడు ఎలాంటి భావోద్వేగాలుంటాయో కూడా తెలియాలిగా..'' అని ఎక్స్ పీరియన్స్ షేర్‌ చేసుకున్నారు పూజా హెగ్డే.