'రాహేలు' షూటింగ్ పూర్తి.. ఆస్కారు రేసు నుంచి '2018' అవుట్..
28 December 2023
TV9 Telugu
వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి హనీరోజ్. ఈ చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ అందుకుంది.
ఈమె లేడీ ఓరియంటెడ్ జానర్‌లో నటించిన సినిమా రాహేలు. మల్టీ లింగ్యువల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
ఆనందిని బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాబూరాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్ కీలక పాత్రల్లో నటించారు.
96 అకాడమీ అవార్డ్స్ రేసు నుంచి 2018 మూవీ తప్పుకుంది. 2024లో జరగనున్న ఆస్కారు వేడుకకు సంబంధించిన షార్ట్ లిస్ట్‌ను ప్రకటించిన జ్యూరి.
పది కేటగిరిలకు సంబంధించిన లిస్ట్‌లు రిలీజ్ కాగా అందులో బ్లాక్ బస్టర్ చిత్రం 2018కు స్థానం దక్కలేదు.
జార్ఖండ్ గ్యాంగ్ రేప్ ఆధారంగా తెరకెక్కిన 'టు కిల్ ఏ టైగర్' డాక్యుమెంటరీ, ఫైనల్ పోటి కోసం షార్ట్ లిస్ట్ అయ్యింది.
డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్ ఖాన్, నెక్ట్స్ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపారు.
ఆ సినిమాలో తన వయసు తగ్గ పాత్రలో కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.