వైట్ శారీ లో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న హనీ రోజ్

TV9 Telugu

15 April 2024

హానీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

గోపీచంద్ మలినేని దర్శకత్వం లో బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి లో హీరోయిన్ నటించి యువతలో క్రేజీ బ్యూటీగా మారింది. 

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.   బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. 

వీరసింహారెడ్డి సినిమాలో కనిపించి ఈ ముద్దుగుమ్మ  సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు  అందరు.

కానీ ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా గురించి ప్రకటించలేదు కానీ సోషల్ మీడియా లో మాత్రం ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హానీ రోజ్ మాత్రం చేతిలో సినిమాలు లేకున్నా కూడా ఎప్పుడు ఏదొక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ  ప్రేక్షకుల మధ్య మెరుస్తూనే ఉంటుంది.

  తాజాగా ఆమె వైట్ శారీలో  పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఫోటోస్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.