ఆ వెన్నెల కూడా మురిసిపోదా ఈ గుమ్మ వన్నెలు చూసి..
25 December 2023
TV9 Telugu
5 సెప్టెంబర్ 1991న కేరళలోని మూలమట్టంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది ముద్దుగుమ్మ హనీ రోజ్ వర్గీస్.
కేరళ రాష్ట్రంలోని మూలమట్టంలో ఉన్న S.H.E.M ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.
ఆలువాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది.
2005లో 14 ఏళ్ల వయస్సులో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్‌లో నటించింది.
2007లో ముధల్ కనవే అనే ఓ రొమాంటిక్ తమిళ చిత్రంలో నటించి కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
2008లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఆలయం అనే తెలుగు చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.
2014లో ఈ వర్షం సాక్షిగా అనే రొమాంటిక్ చిత్రంతో తొలిసారి తెలుగులో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ అందాల భామ.
2023లో సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య మరదలు పాత్రలో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి