పింక్ శారీలో కుర్రకారు మనసును దోచేస్తున్న హనీ..
07 October 2023
5 సెప్టెంబర్ 1991లో కేరళలోని మూలమట్టంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది హాట్ బ్యూటీ హనీ రోజ్.
ఆలువాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.
14 ఏళ్ల వయస్సులోనే 2005లో వినయన్ దర్శకత్వంలో మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్‌లో మొదటిసారిగా నటించింది ఈ వయ్యారి.
2008లో శివాజీకి జోడిగా ఆలయం చిత్రంతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది వయ్యారి భామ హనీ రోజ్ వర్గీస్.
తెలుగులో కంటే తమిళ, మలయాళ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. ఎన్నో తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.
2014లో తెలుగు రొమాంటిక్ మూవీ 'ఈ వర్షం సాక్షిగా' సినిమాలో రెండోసారి తెలుగులో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ భామ.
మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత 2023 సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య మరదలు పాత్రలో మెప్పించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలను కుర్రాళ్లు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి