23 September 2023
సలార్ ఇకపై వాట్సాప్ ఛానెల్లోనే..
సోషల్ మీడియా టెక్స్టింగ్ యాప్, వాట్సాప్‌లోని.. కొత్త ఫీచర్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సెలబ్రిటీలందర్నీ ఆకట్టుకుంటోంది.
వాట్సాప్ ఛానెల్ పేరుతో మొదలైన ఈ ప్రీమియం ఫీచర్.. సెలబ్రిటీలను తమ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేస్తోంది.
ఎలాంటి పీఆర్ తలనొప్పులు లేకుండా.. ఎలాంటి గాలి వార్తలు రాకుండా.. నేరుగా తమ సినిమా అప్డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకునే అవకాశం కల్పిస్తోంది.
దీంతో సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ప్రొడక్షన్ హౌసెస్ కూడా.. అఫీషియల్ వాట్సాప్ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్స్‌ను స్టార్ట్ చేస్తున్నాయి..
ఇక తాజాగా సలార్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే కూడా.. తాజాగా తమ వాట్సాప్ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసింది.
ఆ ఛానెల్లోనే సలార్‌కు సంబంధించిన అన్ని అప్డేట్స్.. ఎక్స్‌క్లూసివ్‌గా ఇస్తామంటూ.. తాజాగా అనౌన్స్ చేసింది.
అయితే హోంబలే తమ వాట్సాప్ ఛానెల్‌ను స్టార్ట్ చేయడమే ఆలస్యం..డార్లింగ్ ఫ్యాన్స్ ఈ ఛానెల్‌ను ఫాలో అవ్వడాన్ని ఓ రేంజ్‌లో మొదలెట్టారు.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. సలార్ అప్డేట్స్‌ను ఎక్స్‌క్లూసివ్‌గా తెలుసుకునేందుకు.. ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి