హిందీలోనూ కుమ్మేస్తున్న కల్కి.. వందకోట్లు దాటిన సినిమా..
TV9 Telugu
01 July 2024
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇప్పుడు కల్కి సినిమా సందడే కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కల్కి
.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు.
జూన్ 27న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తొలి రోజే రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది.
మైథలాజికల్ కథకు సైన్స్ ను మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సినిమా తెరకెక్కించిన నాగి పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 500 కోట్లు వసూల్ చేసి వావ్ అనిపించింది.
అలాగే హిందీలోనూ ఈ సినిమా వందకోట్ల మార్క్ ను దాటేసింది. దాంతో రోబోట్ రోజుల్లో మరిన్ని వసూళ్లు వస్తాయని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి