హాయ్‌ నాన్న ప్రమోషన్స్ లో నాని.. వ్యూహం రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్జివి..

20 November 2023

హాయ్‌ నాన్న ప్రమోషన్ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉన్న నాని, వచ్చిన ఏ ఛాన్స్‌ను వదిలిపెట్టడం లేదు. తాజాగా వరల్డ్ కప్‌ ఫైనల్‌ సందర్భంగా కామెంటేటర్‌గా మారారు నేచురల్‌ స్టార్‌.

గతంలో ఆర్జేగా పనిచేసిన అనుభవంతో కామెంట్రీలోనూ మెప్పించారు. ఈ సందర్భంగా ముంబైలో సల్మాన్‌తో కలిసి నాని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వ్యూహం రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుందని వెల్లడించారు వర్మ.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన వ్యూహం సినిమాలో అజ్మల్‌ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

జోష్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కార్తిక  కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ కేరళకు చెందిన రోహిత్ మేనన్‌ను పెళ్లి చేసుకున్నారు.

హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌ అలీఖాన్‌ పై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై మన్సూర్ అలీఖాన్ స్పందించారు.

'ఓ వ్యక్తిగా నేను ఈ సొసైటీకి చాలా చేశాను. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు' అంటూ ట్వీట్ చేశారు.

అంబానీ ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకలు సోషలో మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పార్టీలో షారూఖ్‌, మెడలో ఓ పాముతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.